ఏపీలో పెన్షన్ల పండుగ.. 3 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చేందుకు కూటమి సర్కార్ కసరత్తు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన మరో మూడు లక్షల మందికి కొత్తగా సామాజిక పింఛన్లు అందించేందుకు సిద్ధమవుతోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వంటి నిరుపేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని విస్తరిస్తోంది.