ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేస్‌లో సంచలన నిజాలు..బయట కాపలా పెట్టి!
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేస్‌ను పోలీసులు ఎనిమిది రోజుల్లోనే ఛేదించారు. జల్సాలు మందలించారన్న కక్షతో, డబ్బు కోసం పాఠశాల విద్యార్థులే ఆమెను కిరాతకంగా హత్య చేసి నగదు దోచుకెళ్లినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.