ATW Telugu English-Telugu Dictionary & AI Tools
4 వీక్షణలు

ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేస్‌లో సంచలన నిజాలు..బయట కాపలా పెట్టి!

ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేస్‌లో సంచలన నిజాలు..బయట కాపలా పెట్టి!

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన నాగార్జున గ్రామర్‌ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య ఉదంతాన్ని పోలీసులు ఎనిమిది రోజుల్లోనే విజయవంతంగా ఛేదించారు. జల్సాలకు అలవాటు పడి, మందలించారన్న కక్షతో పదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నల్గొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వెల్లడించారు. కొండమల్లేపల్లి మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అదే పాఠశాలలో చదువుతూ వసతిగృహంలో ఉంటున్నారు.

వీరి వ్యసనాలను గమనించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి, వారి తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా మందలించారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఆ విద్యార్థులు, ఇంట్లో పెద్దమొత్తంలో నగదు ఉంటుందనే దురాశతో హత్యకు ప్లాన్ చేశారు. ఈ నెల 11న సాయంత్రం రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒకరు బయట కాపలా ఉండగా, మరో విద్యార్థి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించాడు.

 ఇంట్లో ఉన్న రూపారెడ్డిని చూసి భయపడకుండా, వెంట తెచ్చుకున్న కత్తితో ఏకంగా 27 సార్లు అతికిరాతకంగా పొడిచి హత్య చేశారు. అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న రూ.2.50 లక్షల నగదును దోచుకెళ్లారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలాగో సామాజిక మాధ్యమాల్లో వెతికి మరీ ఈ పథకం వేసినట్లు పోలీసులు తేల్చారు. హత్య అనంతరం ఏమీ తెలియనట్లు నటించిన నిందితులు, మరుసటి రోజు రూపారెడ్డి మృతదేహాన్ని చూడటానికి కూడా వచ్చారు.

 ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, 70కి పైగా సీసీ కెమెరాలను పరిశీలించి 80 మందిని విచారించారు. బుధవారం ఉదయం నిందితులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, రక్తపు మరకలు ఉన్న రూ.1.54 లక్షల నగదు లభించింది. నిందితుల నుంచి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఈ కథనాన్ని షేర్ చేయండి:

Nerella Krishna Kumar
రచయిత పరిచయం (Author Profile) ముఖ్య ఎడిటర్ &సీనియర్ రచయిత

Nerella Krishna Kumar

SEO ఎక్స్‌పర్ట్ | వైబ్ కోడర్ | 144+ AI టూల్స్ డెవలపర్ | తెలుగు బ్లాగర్ & కంటెంట్ క్రియేటర్ 🚀 దశాబ్ద కాలానికి పైగా డిజిటల్ ప్రపంచంలో ఆన్‌లైన్ ప్రెజెన్స్‌ను రీషేప్ చేస్తున్నాను. ChatGPT, Claude AI, Gemini వంటి AI టెక్నాలజీలతో పవర్‌ఫుల్ SEO వ్యూహాలు రూపొందించడం మరియు తెలుగులో బ్లాగింగ్ ద్వారా కంటెంట్ మార్కెటింగ్ చేయడం నా ప్రత్యేకత.