ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల. నెలకు రూ.1.47 లక్షల వేతనంతో AEE ఉద్యోగాలు!
ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రూ.1.47 లక్షల వరకు వేతనంతో కూడిన 40 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 6 నుండి 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) మరియు ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఆధారంగా జరుగుతుంది.