క్రిస్టోఫర్ నోలన్ 'ఒడిస్సీ': గ్రీకు రామాయణం - మన ఇతిహాసంతో దాని పోలికలేంటి?
✨ ఆర్టికల్ సారాంశం
ఎడిటర్ గమనిక: ఈ కథనంలో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ 'ఒడిస్సీ' చిత్రాన్ని రూపొందించినట్లు పేర్కొనబడింది. అయితే, మా పరిశీలన ప్రకారం, క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో 'ఒడిస్సీ' పేరుతో ఇటీవలి కాలంలో విడుదలైన చిత్రం ఏదీ లేదు. ఈ కథనం గ్రీకు ఇతిహాసం 'ఒడిస్సీ' మరియు రామాయణం మధ్య గల పోలికలను వివరిస్తుంది.
ఇంగ్లీష్ సినిమాలు అనగానే సాధారణంగా మనకు యాక్షన్, సైన్స్ ఫిక్షన్, 'అవతార్' వంటి సరికొత్త ప్రపంచాలు గుర్తుకువస్తాయి. అయితే, హాలీవుడ్ ఎప్పుడూ సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతూనే ఉంటుంది. అలాంటి ఒక వినూత్న ప్రయోగమే గ్రీకు పురాణ గ్రంథమైన 'ఒడిస్సీ' ఆధారంగా వచ్చిన చిత్రం. అగ్ర దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన అద్భుతమైన మేధస్సు, విజన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఒక మానవుడు సవాళ్లను అధిగమించి, చరిత్ర గమనాన్ని ఎలా మార్చాడు అనేదే ఈ 'ఒడిస్సీ' కథాంశం. "మనుషుల్లో దేవుడిని చూడాలనుకోకు.. నిరాశ చెందుతావు" లాంటి పవర్‌ఫుల్ డైలాగులు ప్రేక్షకుల మనస్సులను నేరుగా తాకుతున్నాయి. అందరూ ఇంతగా మాట్లాడుకుంటున్న ఈ 'ఒడిస్సీ' కథ ఏమిటి? దీనికి, మన రామాయణానికి మధ్య ఉన్న సారూప్యతలు (పోలికలు) ఏమిటి? అనే విషయాలను ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం.
పాశ్చాత్య సాహిత్యం.. ఇలియడ్, ఒడిస్సీ
పాశ్చాత్య సాహిత్యంలో మొట్టమొదటి మహత్తర గ్రంథాలుగా గ్రీకు పురాణాలైన 'ఇలియడ్', 'ఒడిస్సీ'లను చరిత్రకారులు పేర్కొంటారు. క్రీస్తుపూర్వం 1200-1300 మధ్య జరిగిన చారిత్రక గాథల సమాహారంగా నిలిచిన ఈ అమర కావ్యాలను 'హోమర్' అనే అంధ గ్రీకు మహాకవి పద్యరూపంలో అద్భుతంగా రచించారు. నాటి కాలంలో లిపి లేకపోవడం వల్ల ఇవన్నీ జానపద గేయాల రూపంలో ఒక తరం నుండి మరొక తరానికి అందుతూ వచ్చి, కాలక్రమేణా గ్రంథస్థం అయ్యాయి.
ట్రాయ్ యుద్ధం.. ఇలియడ్ గాథ
స్పార్టన్ యువరాజు మెనెలాస్ భార్య, ప్రపంచ సుందరి అయిన హెలెన్ ను ట్రాయ్ యువరాజు ప్యారిస్ మోహించి, ఆమె ఇష్టంతోనే తన దేశానికి తీసుకుపోవడంతో 'ఇలియడ్' కథ ప్రారంభం అవుతుంది. దీన్ని అవమానంగా భావించిన గ్రీకు సైన్యం పదివేల పడవలపై ప్రస్తుతం టర్కీలో ఉన్న 'ట్రాయ్' నగరంపై దండెత్తుతుంది. పదేళ్లపాటు యుద్ధం చేసినా 'ట్రాయ్' లొంగిపోకపోవడంతో ఇథాకా రాజు 'ఒడిస్సియస్' ఒక అద్భుత వ్యూహం రచిస్తాడు.
గ్రీకులు ఓడిపోయి వెనుదిరిగినట్లు భ్రమ కల్పిస్తూ... వారు కోట ద్వారం వద్ద ఒక భారీ చెక్క గుర్రాన్ని (ట్రోజన్ హార్స్) వదిలి వెళ్తారు. ట్రాయ్ నగరవాసులు దాన్ని విజయానికి చిహ్నంగా భావించి కోట లోపలికి తీసుకెళ్తారు. ఆ రాత్రి నగరమంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు.. ఆ గుర్రం కడుపులో దాక్కున్న ఒడిస్సియస్, అతని సైనికులు బయటకు వచ్చి కోట తలుపులు తీసేస్తారు. దీంతో ఒక్కసారిగా చొరబడిన గ్రీకు సైన్యం ట్రాయ్ నగరాన్ని సర్వనాశనం చేస్తుంది. ప్యారిస్‌ను హతమార్చి హెలెన్‌ను వెనక్కి తీసుకురావడంతో ఇలియడ్ కథ ముగుస్తుంది.
ఒడిస్సియస్ క్లిష్ట ప్రయాణమే... ఒడిస్సీ!
ట్రాయ్ యుద్ధం ముగిశాక ఒడిస్సియస్ తిరిగి తన దేశానికి చేరుకోవడానికి చేసిన పదేళ్ల సంక్లిష్ట ప్రయాణమే 'ఒడిస్సీ'. ఈ కారణంగానే జీవితంలో ఎదురయ్యే ఏదైనా సుదీర్ఘమైన ప్రయాణాన్ని 'ఒడిస్సీ' అని పిలవడం వాడుకలోకి వచ్చింది. తన ప్రయాణంలో ఒడిస్సియస్ ఒక ద్వీపంలో ఒక రాక్షసుడిని హతమారుస్తాడు. ఇది గ్రహించిన ఆ రాక్షసుడి తండ్రి, సముద్ర దేవుడు పోసిడియన్ అగ్రహంతో ఊగిపోతాడు.
ఒడిస్సియస్ మాతృభూమికి చేరకుండా తీవ్ర తుఫాన్లతో పదేళ్ల పాటు సముద్రంపైనే అల్లాడేలా శపిస్తాడు. ఈ ప్రయాణంలో 'కాలిప్సో' అనే మంత్రగత్తె ఏడేళ్ల పాటు ఒడిస్సియస్‌ను బంధిస్తుంది. ఆ తర్వాత గ్రీకు దేవత ఎథీనా అనుగ్రహంతో ఒడిస్సియస్ ఎథాకా రాజ్యానికి చేరుకుంటాడు.
గమనిక: నేడు మనం కంప్యూటర్ రంగంలో వాడుతున్న 'ట్రోజన్ వైరస్', 'ఎజెక్స్', అలాగే నిత్య జీవితంలో వాడే మార్ఫిన్ (Morphine), 'అకిలియన్ హీల్' (బలహీనత) లాంటి పదాలన్నీ ఈ గ్రీకు ఇతిహాసాల నుండి ఉద్భవించినవే కావడం విశేషం.
రామాయణంతో సారూప్యత
రామాయణం, ఒడిస్సీ.. ఒక సంస్కృతికి చెందినవి కావు, ఒక కాలానికి చెందినవి కావు. రెండు వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో.. వేర్వేరు సంస్కృతులు, సంప్రదాయాల నేపథ్యంలో సంబంధించిన కథలు. కానీ ఈ రెండింటి మధ్య చాలా సారూప్యతలు మనకు కనిపిస్తాయి.
- సుదూర ప్రయాణాలు: రామాయణంలో రాముడు పద్నాలుగేళ్ల వనవాసం చేస్తాడు, అటు ఒడిస్సీలో ఒడిస్సియస్ పదేళ్ల యుద్ధం తర్వాత పదేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేస్తాడు. ఈ రెండు కథల్లోనూ విజయం తర్వాత తిరిగి వచ్చే క్రమంలో అనేక సవాళ్లు ఎదుర్కొని తన సామ్రాజ్యానికి చేరుకుంటారు.
- వనవాసం & ఇబ్బందులు: రాముడు పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్లాడు. ఆ సమయంలో సీత అపహరణకు గురవుతుంది. రావణాసురుడిని వధించిన తర్వాత సీతతో తిరిగి తన సామ్రాజ్యానికి చేరుకుంటాడు. ఈ రెండింటిలోనూ రాజ్యాన్ని వదిలి వెళ్లడం, మళ్లీ తిరిగి వచ్చే క్రమంలో రకరకాల సమస్యలు ఎదుర్కొని విజయం సాధించడం ముఖ్య ఇతివృత్తం.
- అతీత శక్తులతో పోరాటం: 'ఒడిస్సీ'లో ఒక ప్రాంతంలో పాటలు పాడే శక్తులు (సైరన్స్) నావికులను ఆకర్షిస్తూ ఉంటాయి. వాటి వలలో పడిన వారిని ఆకర్షించి నాశనం చేస్తాయి. 'రామాయణం'లో బంగారు లేడి రూపంలో మాయలేడి వచ్చి రాముడిని సీతకు దూరం గా తీసుకువెళ్లిపోతుంది. రాముడు రాక్షస శక్తులను ఎదుర్కొంటే... ఒడిస్సియస్ తన ప్రయాణంలో సైక్లోప్స్ చేతిలో ఇరుక్కోవడం, సైరన్స్ లాంటి భూతాలను ఎదుర్కోవడం జరుగుతుంది.
ఇతిహాసంలో స్వయంవరం & ధనుస్సు పోలిక
వింతగా నాటి కాలానికి సంబంధించిన ధనస్సు ఈ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించింది.
'ఒడిస్సీ'లో పెనెలోపి (ఒడిస్సియస్ భార్య) పునర్వివాహానికి ధనస్సు పరీక్ష పెడుతుంది. ఒడిస్సియస్‌కు చెందిన ధనస్సు నారిని బిగించిన వారిని పెళ్లి చేసుకుంటానని స్వయంవర ప్రకటన చేస్తుంది. కానీ ఎవ్వరూ ఆ పరీక్షలో నెగ్గరు. బిచ్చగాడి వేషంలో వచ్చిన ఒడిస్సియస్ ధనస్సు నారిని బిగిస్తాడు. ఇదే విధంగా 'రామాయణం'లో సీత స్వయంవరంలో రాముడు మాత్రమే శివధనస్సును విరుస్తాడు.
ఇలా ఇరవై ఏళ్ల తర్వాత (పదేళ్ల యుద్ధం, పదేళ్ల ప్రయాణం) ఒడిస్సియస్ యాచకుడి వేషంలో ఇథాకా వస్తాడు. అప్పటికే అతడి భార్య పెనెలోపిని వివాహం చేసుకోవడానికి 108 మంది రాజులు ఆమె కోటలోనే మకాం వేసి ఉంటారు. వారి పీడ వదిలించుకోవడానికి పెనెలోపి స్వయంవర ప్రకటన చేస్తుంది. ఒడిస్సియస్ మాత్రమే ఎక్కుపెట్టగలిగిన భారీ విల్లును వంచి, ఒకే బాణంతో వరుసగా ఉన్న 12 గొడ్డళ్ల కన్నాల గుండా సంధించిన వాడినే వరిస్తానని చెబుతుంది. రాజులంతా విఫలమవ్వగా, యాచకుడి వేషంలో ఉన్న ఒడిస్సియస్ ఆ విల్లును వంచి, బాణాన్ని విజయవంతంగా సంధించి తన నిజ రూపాన్ని ప్రకటిస్తాడు. వెంటనే ఆ 108 మంది రాజులను వధించి, భార్యను, పుత్రుడిని చేరి తిరిగి రాజ్యాధికారాన్ని చేపడతాడు.
ముగింపు
'ఒడిస్సీ' అనే అద్భుత కావ్యాన్ని క్రిస్టోఫర్ నోలన్ అతి తక్కువ గ్రాఫిక్స్‌తో రూపొందించడం ఒక విశేషమనే చెప్పాలి. ఇప్పటిదాకా ఎప్పుడూ చూడని సుందరమైన ప్రదేశాలు మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి. ప్రాచీన కావ్యానికి దృశ్యరూపం ఇస్తూ, మానవ నైజాలను, పోరాట పటిమను వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.