Advertisement
Trends ✓ పరిశీలించిన వార్త

విజయ్ ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు: డమ్మీ సీఎం మరియు జోకర్ క్యాబినెట్‌గా అభివర్ణన

📅 Aug 04, 2026 ⏱️ ~5 నిమిషాల రీడ్ 📝 208 పదాలు 👁️ 13 వ్యూస్
🎙️ AI 60-సెకన్ల ముఖ్యాంశాల ఆడియో
సిద్ధంగా ఉంది
విజయ్ ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు: డమ్మీ సీఎం మరియు జోకర్ క్యాబినెట్‌గా అభివర్ణన
📸 చిత్రం: విజయ్ ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు: డమ్మీ సీఎం మరియు జోకర్ క్యాబినెట్‌గా అభివర్ణన (వ్యాస సూచిక)

తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదానికి సంబంధించిన కేసులో ఆయన అరెస్టయి, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ పరిణామాలపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని సీఎం విజయ్‌ ప్రభుత్వంపై ఆయన ఎక్స్‌ వేదికగా ఘాటు విమర్శలు గుప్పించారు.

 అహంకారం ఎప్పుడూ వినాశనానికి దారితీస్తుందని, అది నిరంతరం కొనసాగితే మరింత వేగంగా పతనమవుతారని స్టాలిన్‌ హెచ్చరించారు. విజయ్‌ ఓ అసమర్థ నాయకుడని మండిపడ్డారు. కావేరీ నదీ జలాలు, మేకెదాటు ప్రాజెక్టుల విషయంలో తమిళనాడు హక్కులను అణచివేసేందుకు కేంద్రం యత్నిస్తోందని, దాన్ని ఖండిస్తూ తంజావూరులో డీఎంకే ఆందోళన చేపట్టిందని గుర్తుచేశారు. ఆ సభలో ఉదయనిధి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని, ఆ విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసిందని ఆరోపించారు.

రాష్ట్రంలో సీఎం విజయ్‌ కావేరీ నీటిని తీసుకురాలేరని, ఆయనో డమ్మీ సీఎం అంటూ స్టాలిన్‌ ఎద్దేవా చేశారు. ఇక ఆయన మంత్రులు ఒక సినిమాను పట్టుకుని వేలాడుతున్నారని, రాష్ట్రంలో ఒక జోకర్‌ క్యాబినెట్‌ అధికారంలో ఉందని దుయ్యబట్టారు. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఉదయనిధి పట్ల పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. కోర్టు విచారణ సందర్భంగా ఉదయనిధిని కస్టడీలోకి తీసుకునే ఉద్దేశం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారని, అలాంటప్పుడు ఆయనను తంజావూరుకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు.

 

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను విమర్శిస్తున్న వారందరినీ విజయ్‌ అరెస్టు చేయిస్తున్నారని స్టాలిన్‌ ఆరోపించారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు ఉదయనిధిని దూరంగా ఉంచాలనే కుట్రతోనే తప్పుడు కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఎవరిపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ అలా చేసినట్లు నిరూపిస్తే తక్షణమే క్షమాపణలు చెబుతామని స్పష్టం చేశారు. సీఎం విజయ్‌ ఇకనైనా రీల్స్‌ క్రియేట్‌ చేయడం మాని, బాధ్యతలను గుర్తించి నడుచుకోవాలని ఆయన హితవు పలికారు.

ఈ కథనంపై మీ అభిప్రాయం ఏమిటి? 👇
✅ మీ అభిప్రాయం నమోదైంది! ధన్యవాదాలు.
ఈ ముఖ్య కథనాన్ని మిత్రులతో పంచుకోండి:
𝕏 Twitter f Facebook ✈️ Telegram
Nerella Krishna Kumar
రచయిత పరిచయం (Author Profile) ముఖ్య ఎడిటర్ &సీనియర్ రచయిత

Nerella Krishna Kumar

నెరెళ్ల కృష్ణ కుమార్ డిజిటల్ రంగంలో దశాబ్ద కాలపు అనుభవం కలిగిన SEO నిపుణులు మరియు 144కు పైగా AI టూల్స్ డెవలపర్. అత్యాధునిక AI సాంకేతికతలను ఉపయోగిస్తూ, ప్రభావవంతమైన కంటెంట్ మార్కెటింగ్ మరియు వ్యూహాత్మక SEO పరిష్కారాలను అందించడంలో ఆయన ప్రత్యేకత కలిగి ఉన్నారు. తెలుగు డిజిటల్ కంటెంట్ ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడమే లక్ష్యంగా ఆయన కృషి చేస్తున్నారు.

సంబంధిత తాజా కథనాలు

అన్నీ చూడండి →

తెలుగు తాజా వార్తలు & విశేషాలు - 18 సెప్టెంబర్ 2026

తెలుగు తాజా వార్తలు & ట్రెండింగ్ విశేషాలు - 16 సెప్టెంబర్ 2026 | Daily News Briefing

తెలుగు తాజా వార్తలు & ట్రెండింగ్ విశేషాలు - 12 సెప్టెంబర్ 2026 | Daily News Briefing

తెలుగు తాజా వార్తలు & ట్రెండింగ్ విశేషాలు - 11 సెప్టెంబర్ 2026 | Daily News Briefing

🎨 WhatsApp స్టేటస్ పోస్టర్

ఈ ముఖ్య కథనాన్ని ఆకర్షణీయమైన పోస్టర్‌గా మార్చి షేర్ చేయండి!

Trends ATW TELUGU
విజయ్ ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు: డమ్మీ సీఎం మరియు జోకర్ క్యాబినెట్‌గా అభ
📅 19 Sep 2026 www.atwtelugu.online